|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:29 PM
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్... ఇండియా కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గుంజన్ సోనీని నియమించినట్లు సోమవారం ప్రకటించింది. వ్యాపారం, టెక్నాలజీ, మార్కెటింగ్, ఇ-కామర్స్ రంగాల్లో రెండు దశాబ్దాలకు పైగా నాయకత్వ అనుభవం కలిగిన గుంజన్, భారత్‌లో యూట్యూబ్ వృద్ధి, ఆవిష్కరణల బాధ్యతలను చేపట్టనున్నారు.ఈ నియామకంపై యూట్యూబ్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ ఆనంద్ మాట్లాడుతూ, "భారతదేశంలో యూట్యూబ్ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా సాగుతోంది. అపారమైన సృజనాత్మకత, సామర్థ్యం ఉన్న దేశమిది. మా తదుపరి వృద్ధి దశకు మార్గనిర్దేశం చేసేందుకు అనుభవజ్ఞురాలైన గుంజన్‌కు స్వాగతం పలుకుతున్నందుకు సంతోషంగా ఉంది" అని తెలిపారు. క్రియేటర్ ఎకానమీ, భారతదేశ వీడియో కామర్స్ రంగంపై ఆమెకున్న లోతైన అవగాహన, నాయకత్వ పటిమతో క్రియేటర్ల వృద్ధిని వేగవంతం చేయడానికి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, వినియోగదారులను ఆకట్టుకోవడానికి, భారతదేశ డిజిటల్ ప్రయాణానికి మరింత తోడ్పడటానికి వీలు కలుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Latest News