|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:51 PM
అరుణ్ కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన 'వీర ధీర శూరన్ - పార్ట్ 2' ఇటీవలే విడుదలై విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ యాక్షన్ డ్రామాలో విక్రమ్ కాళి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు హిందీ, మలయాళం, తెలుగు, తమిళ మరియు కన్నడ భాషలలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఇండియా వైడ్ గా ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. దుషార విజయన్, SJ.సూర్య మరియు సూరజ్ వెంజరమూడు, ప్రుధ్వి రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. తేని ఈశ్వర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, ప్రసన్న జికె ఎడిటర్, సిఎస్ బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ చిత్రానికి GV. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News