|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 01:29 PM
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భార్యపై ప్రశంసలు కురిపించారు. ‘నేను ఈ స్థాయిలో ఉండడానికి నా భార్య షాలినినే కారణం. ఆమె నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ప్రతి పనిలోనూ నాకు తోడుంటుంది. ఒక్కోసారి నేను సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా ఆమె అండగా నిలిచింది. నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా ఆమెకే ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు.‘నేను కేవలం నటుడిని. నటన నాకు జీతాన్నిచ్చే ఓ ఉద్యోగంగా భావిస్తాను. సూపర్‌స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. ఎందుకంటే అలాంటి ట్యాగ్స్‌పై నాకు నమ్మకం లేదు. 33 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నా వృత్తిని ప్రేమిస్తాను. జీవితమంతా అభిమానులను అలరించడానికే ప్రయత్నిస్తాను. సాధ్యమైనంతవరకూ సాదాసీదాగా ఉంటాను. అతిగా ఆలోచించను.
Latest News