|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 03:14 PM
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రెట్రో' లో కోలీవుడ్ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ప్రేమకథ. ఈ చిత్రం రేపు అంటే మే 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మూవీపై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. రేపు మే డే సందర్భంగా సెలవు దినం కారణంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. నాగ వంశి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. పూజా హెగ్డే మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. శ్రియా సరన్ సూర్యతో పాటు ఒక ప్రత్యేక పాటలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో జోజు జార్జ్, కరుణకరన్, జయరామ్, కరుణకరన్, నస్సార్, ప్రకాష్ రాజ్, నందిత దాస్, తారక్ పొన్నప్ప ముఖ్యమైన పాత్రలలో ఉన్నారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి ట్యూన్లను కంపోజ్ చేస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద జ్యోతిక మరియు సూర్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News