|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 04:37 PM
గురువారం నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ముంబయి బయల్దేరి వెళ్లారు. ముంబయి వెళ్లేందుకు ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ముంబయి వేదికగా మొదటి ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. ఇది మీడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం. ఇక్కడ ఆయన మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.
Latest News