|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 07:49 AM
నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' మే 1న తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల అయ్యింది. సైలేష్ కోలాను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భారీ బజ్ ఉంది మరియు ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద కొత్త రికార్డుస్ ని సృష్టిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఒకటి ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని 12 కోట్లకి సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయం పై అధికారక ప్రకటన వెలువడనుంది. హిట్ ఫిల్మ్ యొక్క సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక బృందంలో ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగల, సను జాన్ వర్గీస్ కెమెరాను క్రాంక్ చేస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమ్స్ ప్రొడక్షన్స్ కింద ప్రశాంతి టిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Latest News