|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 03:47 PM
ప్రముఖ నటుడు-కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాబౌయే తన తదుపరి చిత్రం "బెంజ్" తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ మూవీపై భారీ సంచనాలని సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ప్రముఖ నటి సంయుక్త మహిళా ప్రధాన పాత్ర కోసం సెలెక్ట్ అయ్యినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, మరియు జగదీష్ పళనిసామి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న "బెంజ్"ని లోకేష్ కనగరాజ్ యొక్క జి స్క్వాడ్, ప్యాషన్ స్టూడియోస్ మరియు ది రూట్ సమర్పిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ రచన మరియు దర్శకత్వం వహించిన "బెంజ్" ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం కానుండగా, మిగిలిన నటీనటులు మరియు సిబ్బంది వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News