|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 07:40 AM
విశ్వం: శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ నటించిన 'విశ్వం' యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో జూన్ 1న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కావ్య థాపర్ గోపీచంద్ కి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, ప్రవీణ్, VTV గణేష్ మరియు ఇతర నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. TG విశ్వ ప్రసాద్ మరియు వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ యాక్షన్ కామెడీ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు ప్రసారానికి అందుబాటులో ఉంది.
ఇంద్ర: టాలీవుడ్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర' సినిమా జూన్ 1న సాయంత్రం 6 గంటలకి జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2002లో జూలై 24న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమా ఇంద్ర. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆర్తీ అగర్వాల్, ముఖేష్ రిషి, సునీల్, వేణు మాధవ్, బ్రహ్మానందం మరియు ఇతరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి VSR స్వామి సినిమాటోగ్రఫీ అందించగా, మణి శర్మ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. అశ్విని దత్ యొక్క వైజయంతి మూవీస్ ఈ సినిమాని నిర్మించింది.
Latest News