|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 04:17 PM
కన్నడ భాషపై కమల హాసన్ చేసిన వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది. ఆయన నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలంటే కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) ఇప్పటికే ప్రకటించింది. ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలన్నింటినీ రాష్ట్రంలో నిషేధిస్తామని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి తాజాగా హెచ్చరించారు. "నేను ఇప్పటికే ఒక లేఖ రాశాను. ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మంచి నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో కమల హాసన్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాను నిషేధిస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
Latest News