|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 04:18 PM
తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్స్ అవార్డుల పట్ల టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.మహేశ్ బాబు స్పందిస్తూ, "శ్రీమంతుడు, మహర్షి, మేజర్ వంటి చిత్రాలకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించి, సినీ పండుగలాంటి వాతావరణాన్ని సృష్టించేందుకు చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాల విజయానికి కారకులైన నా దర్శకులకు మరింత ప్రేమను తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
Latest News