|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 04:43 PM
ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి 2025 పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత విజేతగా నిలిచారు. తన సౌందర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు ఆమె అందుకున్నారు. ఈ విజయంతో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి థాయ్‌లాండ్ మహిళగా ఓపల్ సుచాత చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో, ప్రపంచ సుందరి పోటీల్లో విజేతను ఎలా ఎంపిక చేస్తారనే అంశంపై నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జూలియా మోర్లే ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రపంచ సుందరి పోటీల్లో కేవలం బాహ్య సౌందర్యం, శరీర కొలతలే కాకుండా అనేక ఇతర ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పోటీదారుల వ్యక్తిత్వం, వారి సేవా దృక్పథం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని ఆమె తెలిపారు.
Latest News