|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:21 PM
హీరో నారా రోహిత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. చాలా కాలం తర్వాత ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ సినిమా సక్సెస్ మీట్‌లో తన పెళ్లి గురించి ఓ తీపి కబురు చెప్పారు. తాను హీరోయిన్ సిరితో తన పెళ్లి అక్టోబర్ లో జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.నారా రోహిత్, సిరి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. వాస్తవానికి, వీరి వివాహం గత డిసెంబర్‌లోనే జరగాల్సి ఉండగా, అనుకోని విషాదం చోటుచేసుకుంది. నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో పెళ్లి వాయిదా పడింది.ఈ విషయంపై ‘భైరవం’ చిత్ర విజయోత్సవ సభలో స్పందించిన నారా రోహిత్, "మా నాన్నగారు రామ్మూర్తి నాయుడుగారి సంవత్సరికం పూర్తయిన తర్వాత, ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపారు.
Latest News