|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 03:51 PM
కోలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది త్రిష. ఆమెకు 42 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంది. ఈ వయస్సులో కూడా యంగ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. కుర్ర హీరోయిన్లకి అందంలో పోటీ ఇస్తుంది. అదే సమయంలో తన తోటి హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఇప్పటికీ వరుసగా భారీ ఆఫర్లని అందుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గానూ నిలిచింది. ఆమె ఒక్కో మూవీకి రూ.12కోట్ల పారితోషికం అందుకుంటుందని సమాచారం.అలాగే ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో హీరో సూర్యకి జోడీ కట్టింది త్రిష. అంతేకాకుండా తెలుగులో చిరంజీవితో కలిసి 'విశ్వంభర' చిత్రంలోనూ నటిస్తుంది. మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి ఓ మూవీ చేస్తుంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళంలో భారీ చిత్రాలతో బిజీగా ఉంది త్రిష. ఇదిలా ఉండగా, హీరోయిన్ త్రిష పేరుతో ఒక విలేజ్ ఉంది. ఈ విషయాన్ని ఆమె అభిమానులు కనిపెట్టారు. ఒక అభిమాని ఆ ఊరి పేరు ఉన్న బోర్డు ముందు నిల్చొని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, దాన్ని త్రిష కూడా తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసి ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఆ ఊరి పేరు 'Vijayak Trisha'. ఆ ఊరు లడఖ్‌లోని నూబ్రా లోయ నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్ అని పిలువబడే సియాచిన్ బేస్ క్యాంప్‌కు వెళ్లే దారిలో ఉందట.ఇదిలా ఉండగా, హీరోయిన్ త్రిష పేరుతో ఒక విలేజ్ ఉంది. ఈ విషయాన్ని ఆమె అభిమానులు కనిపెట్టారు. ఒక అభిమాని ఆ ఊరి పేరు ఉన్న బోర్డు ముందు నిల్చొని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, దాన్ని త్రిష కూడా తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసి ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఆ ఊరి పేరు 'Vijayak Trisha'. ఆ ఊరు లడఖ్‌లోని నూబ్రా లోయ నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్ అని పిలువబడే సియాచిన్ బేస్ క్యాంప్‌కు వెళ్లే దారిలో ఉందట.
Latest News