|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 03:56 PM
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'కింగ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఏకంగా 12 మంది స్టార్స్ నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, రాణీ ముఖర్జీ, దీపికా పదుకొణే, సౌరబ్ శుక్లా, జైదీప్ అహ్లవత్ వంటి స్టార్స్ పేర్లు ఇప్పటికే బయటకొచ్చాయి.షారూఖ్ కొత్తలుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆయన నటిస్తున్న 'కింగ్' షూటింగ్ మొదలైంది. షారుఖ్ ఖాన్ నయా లుక్ ఈ మూవీ కోసమేనా అనేది ఆసక్తికరంగా మారింది. కండలు, టాటూలతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన యంగ్ లుక్ అభిమానులను ఉత్సాహపరిచింది.
Latest News