|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:34 PM
ప్రఖ్యాత కెనడియన్ ర్యాప్ సింగర్, మ్యూజిక్ ఐకాన్ డ్రేక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై ఆయన ఏకంగా 7.50లక్షల అమెరికన్ డాలర్ల (రూ. 6.41 కోట్లు) భారీ మొత్తంలో పందెం కాసి క్రికెట్, వినోద రంగాల్లో పెద్ద చర్చకు దారితీశారు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుతో జరగనున్న తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయం సాధిస్తుందని డ్రేక్ భారీగా బెట్టింగ్ పెట్టారు.ఈ భారీ పందెం వివరాలను డ్రేక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 'స్టేక్'లో తాను వేసిన పందెం తాలూకూ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ, దానికి ఆర్‌సీబీ అభిమానుల చిరకాల నినాదమైన 'ఈసారి కప్ మనదే' అనే క్యాప్షన్‌ను జోడించారు. దాంతో ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫాలోవర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది.
Latest News