|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:52 PM
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇప్పటికే ఈ లో టబు, రాధిక ఆప్టే కీలకపాత్రలు పోషించనున్నారు.ఇప్పుడు మరో హీరోయిన్ సెలక్ట్ అయినట్లు సమాచారం.బాలీవుడ్‌లోని అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో రాధికా ఆప్టే ఒకరు. రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ 'కబాలి' ద్వారా ఆమె దక్షిణ చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. తాజాగా రాధిక, పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి లో నటించనున్నట్లు టాక్.అయితే ఇప్పుడు ఈ నుంచి రాధిక తప్పుకుందని.. ఆమె స్థానంలో మరో టాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు టాక్. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ లో రాధిక స్థానంలో నటి నివేదా థామస్‌ను పరిశీలిస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.నివేదా థామస్ ఇదివరకు రజనీకాంత్ తో దర్బార్ లో దళపతి విజయ్ తో 'జిల్లా' లో పనిచేసింది. నివేదా, మేకర్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందిఈ షూటింగ్ కోసం హైదరాబాద్ , చెన్నైలలో లొకేషన్లను వెతుకుతున్నారట. ఈ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుంది. విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాధ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది.నివేధా థామస్ చివరిసారిగా 35 చిన్న కథ కాదు అనే చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో గృహిణి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇటీవలే ఆమె నటనకుగానూ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ దక్కించుకుంది.
Latest News