by Suryaa Desk | Tue, Nov 12, 2024, 04:08 PM
వికారాబాద్ జిల్లా క్లబ్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ జిల్లా సదస్సు జిల్లా అధ్యక్షులు శ్యాం ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వికలాంగులకు 6000 వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత గీత కార్మికులకు బీడీ కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ పింఛన్ పెంచుతామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్‌దారులను మర్చిపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. పక్క రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచితే బంగారు తెలంగాణలో మాత్రం పింఛన్ పెంచకపోవడం పింఛన్ పెంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ లో ఆసరా పింఛన్ పెంచి ప్రతినెల 1వ తారీఖునే ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంటే తెలంగాణలో మాత్రం 30వ తేదీ జరిగిన పెన్షన్స్ అందజేస్తే లేరంటే ఆసరా పింఛన్‌దారుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.
కనుక పింఛన్లు పెంచమని కనీసం ప్రతిపక్షాలైన ఆసరా పింఛన్‌దారుల పక్షాన పోరాటం చేస్తారని అనుకుంటే వారు కూడా పించన్ దార్ల పక్షాన నిలబడక పోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు ఆసరా పింఛన్‌దారులకు అండగా ఉండి పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్న ఏకైక వ్యక్తి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారే మొన్నటికి మొన్న హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి పింఛన్లు పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తాడోపేడో తెలుసుకోవడం కోసం ఉద్యమ కార్యచరణ ప్రకటించారు నవంబర్ 1నుండి 16 వరకు అన్ని జిల్లాల సదస్సులు నిర్వహించి నవంబర్ 17 నుండి 23 వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మందితో నవంబర్ 26న చలో హైదరాబాద్ చేపట్టి తీరుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు జర్నమ్మ జిల్లా నాయకులు రాజు తదిరులు పాల్గొన్నారు.