|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:22 PM
తెలంగాణలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతర ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఫిబ్రవరి 16న ప్రధాన ఘట్టమైన 'బండ్ల ఉత్సవం' కోలాహలంగా సాగనుంది. 17న రథోత్సవంతో జాతర ముగియనుంది.ఈ ఏడాది కూడా జాతరలో భాగంగా మొదటి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకోనున్నారు. రెండో రోజైన ఫిబ్రవరి 16న జాతరలోనే ప్రధాన ఘట్టమైన ‘బండ్ల ఉత్సవం’ అత్యంత కోలాహలంగా సాగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదర్శనగా తిరుగుతూ మొక్కులు తీర్చుకుంటారు. ఆఖరి రోజైన ఫిబ్రవరి 17న రథోత్సవంతో ఈ మహా క్రతువు ముగుస్తుంది.