|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:50 PM
పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న గోకుల్ ఫంక్షన్ హాల్ పనులు పూర్తయ్యాయని.. అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం గోకుల్ నగర్ లో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులు.. విశాలమైన గదులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫంక్షన్ హాళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని తెలిపారు. కుల పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి అతి త్వరలో ఫంక్షన్ హాల్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.