|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:30 PM
పాలన గాలికొదిలేసి, బూతులతో రెచ్చిపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో సీఎం ఒక్కసారైనా రైతుల సమస్యల గురించి మాట్లాడిండా అని ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'గురుకులాల్లో పాముకాటులతో, కల్తీ ఆహారంతో పిల్లల ప్రాణాలు పోతుంటే.. ఏ రోజైనా రేవంత్ రెడ్డి మాట్లాడిండా?. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ గురించి ప్రశ్నిస్తే మాట్లాడడు. పెన్షన్ గురించి మాట్లాడడు. కానీ కేసీఆర్ మీద మాత్రం బూతులు మాట్లాడుతాడు' . 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, వృద్ధుల పెన్షన్లు, మహిళలకు హామీ ఇచ్చిన రూ.2500, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగుల డీఆర్సీ, పీఆర్సీ, డీఏలు—ఇవన్నీ ఏ ఒక్క అంశంపైనా సీఎం మాట్లాడటం లేదని ఆరోపించారు.