|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:53 PM
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బండంకొమ్ము లో హనుమంత్ రెడ్డి స్పోర్ట్స్ బాక్సింగ్ & కిక్ బాక్సింగ్ నూతన అకాడమీనీ పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారితో కలిసి అమీన్పూర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ బిజిలి రాజు, మాజీ కౌన్సిలర్ కొల్లూరి చంద్రకళ గోపాల్, మాజీ కో ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, సీనియర్ నాయకులు చౌటకురి బాలరెడ్డి, దాసు యాదవ్,చౌటకురి మహిపాల్ రెడ్డి,జ్ఞానేశ్వర్, అకాడమీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.