|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:26 PM
జలమండలి ఆధ్వర్యంలో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు గోదావరి 2&3, అమృత్ 2.0 ఎస్టీపీ ప్రాజెక్టు, నియోపోలీస్... నీటి సరఫరా ప్రాజెక్టులను బుధవారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. అందులో బాగంగా మొదటగా ఖానాపూర్ లో గోదావరి 2&3 ప్రాజెక్టుల భాగంగా నిర్మిస్తున్న డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణ పనులను పరిశీలించారు.నియోపోలీస్ సమగ్ర మంచినీటి సరఫరా కోసం చేపట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపింగ్ స్టేషన్, డబ్ల్యూటీపీ సంబంధించిన భూ కేటాయింపు పై.. హెచ్ఎండీఏ ఉన్నత అధికారులతో కలిసి చర్చించారు. భవిష్యత్తు అవసరాలను దృష్ట్యా నీటి సరఫరా సేవలకై భూ కేటాయింపులో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే, హెచ్ఎండీఏ నియో పోలీస్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన మంచినీరు పైపులైన్ల, సీవరేజ్ లైన్ల నిర్మాణ వివరాలను లెవల్స్ తో సహా జలమండలికి సమర్పించాలని కోరారు. జలమండలి ఈ ప్రాంతంలో తాగునీరు సరఫరా చేయడానికి రెండు 2.5 మిలియన్ లీటర్లు రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ఈ రిజర్వాయర్ల వల్ల ఏయే ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా మంచినీరు సరఫరా చేయగలమో అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోపోలీస్ లో భూమిరేటు అత్యధికంగా పలుకుతున్న నేపథ్యంలో రెండు రిజర్వాయర్లను రెండు ఫ్లోర్ల లాగా నిర్మిస్తే మిగిలిన ఖాళీ స్థలం భవిష్యత్తు అవసరాలకు ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా రిజర్వాయర్ల నిర్మాణానికి టెక్నికల్ గా సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం జంట జలాశయాలలోకి మురుగు చేరకుండా జలమండలి నాలుగు ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా జన్వాడలో బుల్కాపూర్ నాలా వద్ద నిర్మిస్తున్న 4 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ పనులను పరిశీలించారు.