|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 08:55 PM
గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. గ్రూప్-1 నియామకాల విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.ఇంతకుముందు గ్రూప్-1 నియామకాలపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని న్యాయమూర్తి అప్పట్లో ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తుది తీర్పుకు లోబడి గ్రూప్-1 నియామకాలను కొనసాగించవచ్చని గతంలోనే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసింది.
*తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా: రేవంత్‌రెడ్డి గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఎంతమంది, ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని ప్రయత్నించినా, వాటన్నింటినీ ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గ్రూప్-1 అధికారులుగా మీరు నియమితులయ్యారని పేర్కొంటూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి మీరు అంకితభావంతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానళ్లను ఫాలో అవ్వండి. అలాగే మా ప్రజాతంత్ర YouTube ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వార్తను షేర్ చేయడం మర్చిపోవద్దు.