|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 03:58 PM
దేవరకొండ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ముందు ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా, గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 8500 కోట్ల రూపాయల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, కాస్మోటిక్ ఛార్జీలు, పాకెట్ మనీ తక్షణమే విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చల్లేటి భాస్కరాచారి, రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేశ్వర్లు, గణేష్, వెంకట యాదవ్, వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.