![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 12:10 PM
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో భాగంగా నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాలో నటించినందుకు డేవిడ్ వార్నర్ రూ.3 కోట్లు అందుకున్నాడట. ఇక సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి చార్జి చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు డేవిడ్ భాయ్ చాలా కాస్ట్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Latest News