![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 12:22 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు లతో పాటు తన సేవా కార్యక్రమాలతోనూ కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాడు.తాజాగా మరో మంచి పని చేసి అందరి మన్ననలు అందుకున్నాడు మహేష్.మహేష్ బాబు సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి పలు మంచి పనులు చేస్తున్నడీ సూపర్ స్టార్ . తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనే మొట్ట మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడు మహేష్. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో ఈ మిల్క్ బ్యాంక్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన మిల్క్ బ్యాంక్ ఓపెనింగ్ కార్యక్రమంలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి మిల్క్ బ్యాంక్ ను అధికారికంగా ప్రారంభించారు.వివిధ కారణాలతో పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తల్లి ఉన్నప్పుడు ఈ బ్యాంక్ ద్వారా తల్లి పాలని చిన్నారులకు అందజేస్తారు. ఇదే సందర్భంగా నమ్రత ఆస్పత్రిలో గుండె సమస్యలతో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించారు. వారితో చాలా సేపు గడిపారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలన నమ్రత తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు మహేష్-నమ్రత దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Latest News