![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 12:30 PM
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సుమంత్ శైలేంద్ర సరసన లీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.తర్వాత అదే ఏడాది నభా నటేష్ సాహెబా సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసి యువతను ఫిదా చేసిందనడంలో అతిశయోక్తిలేదు. తర్వాత సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే సినిమాలో నటించి మెప్పించింది.బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా వసూళ్ల విషయంలో కూడా దూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఈ దెబ్బకు ఈ ముద్దుగుమ్మకు రవితేజతో నటించే చాన్స్ సంపాదించుకుంది. డిస్కో రాజా (Ḍisko raja) సినిమా కోసం దర్శక నిర్మాతలు ఈ భామను అప్రోచ్ అయ్యి.. కథానాయికగా ఎంపిక చేశారు. తర్వాత సోలో బ్రతుకే సో బెటర్‌లో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.తెలుగులో కాకుండా ఈ అమ్మడు కన్నడలో కూడా తన ప్రతిభ చూపించింది. లీ, వజ్రకాయ, అధుగో , సాహెబా .. అలాగే డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ , డార్లింగ్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్వయంభు సినిమాలో నటిస్తుంది.ఇందులో నిఖిల్ సిద్ధార్థఅండ్ నభా నటేష్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఇకపోతే నభా నటేష్ తాజాగా తన అభిమానులతో ఓ పోస్ట్ పంచుకుంది. థైస్ కనిపించేలా ఓ టేబుల్‌పై కూర్చుని.. చేతిలో కోకో కోలా పట్టుకుని ఘాటు ఫొటో షూట్ చేసింది. అలాగే ఈ బ్యూటీ నడుము అందాల్ని ప్రదర్శిస్తూ.. రెండు చేతుల్లో పిజ్జా పట్టుకుని నోట్లో పెట్టుకుని ఊరిస్తుంది. టేబుల్‌పై కూర్చుని చిల్ అవుతోన్న ఈ ఘాటు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.