![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:37 PM
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీటీ15(వర్కింగ్ టైటిల్)’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్‌తోపాటు కథానాయిక రితిక నాయక్ పాల్గొన్నారు. ఇండో-కొరియన్ హారర్- కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుంచే ప్రారంభిస్తున్నామని చిత్రబృందం తెలిపింది. కాగా, వరుణ్ తేజ్ చివరి సినిమా ‘మట్కా’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ‘ఎఫ్-3’ తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మేర్లపాక గాంధీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘ఏక్ మినీ కథ’ లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. దాంతో ‘వరుణ్ తేజ్- మేర్లపాక’ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Latest News