![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 01:07 PM
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, సీనియర్ నటుడు మోహన్ బాబు కలిసి ముచ్చటించుకుంటున్న ఫొటోను నటుడు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వారి పేర్లను కూడా మార్చేశారు. ‘‘ఈ ఇద్దరితో సాయంత్రం వైల్డ్‌గా సాగింది. మోహన్‌బాబు వర్మ, మంచు రాంగోపాల్. వీరిలో పెద్ద రౌడీ ఎవరు? అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు.కాగా, విష్ణు, మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో ‘రౌడీ’ అనే సినిమాను వర్మ రూపొందించారు. అలాగే, విష్ణు హీరోగా ‘అనుక్షణం’ సినిమా తీశారు. 2014లో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. మరోవైపు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తుండగా, పలు చిత్ర పరిశ్రమలకు చెందిన టాప్ నటులు ఈ మూవీలో అతిథి పాత్రల్లో నటిస్తున్నారు.
Latest News