|
|
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 04:05 PM
ప్రముఖ హాలీవుడ్ నటుడు నిక్కీ కేట్ (54) కన్నుమూశారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 1980లో నిక్కీ కేట్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అమెరికన్ యకుజా, డేజ్డ్ అండ్ కన్ఫూజ్డ్, ఫాంటమ్స్, ది బేబీ సిట్టర్, ఇన్సోమేనియా తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే 30 వరకు టీవీ సిరీస్‌లలో నటించారు.భాషలతో సంబంధం లేకుండా అన్ని రకాల సినీ అభిమానులను నిక్కీ కేట్ ఆకట్టుకున్నారు.ఆయన భారతీయ సినీ అభిమానులకు కూడా సుపరిచితుడు. అన్నట్టు నిక్కీ 40 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే దాదాపు 30 టీవీ సిరీస్‌లలోనూ నటించారు. హాలీవుడ్‌లో కల్ట్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు.
Latest News