![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 13, 2025, 04:08 PM
తిరుమల శ్రీవారిని హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఆదివారం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మీనాక్షి చౌదరికి రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల మీనాక్షి చౌదరిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు. తనను విష్ చేసిన వారికి తిరిగి అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు.ఇటీవల కాలంలో హిట్స్ అందుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్న నటి... మీనాక్షి చౌదరి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆమె కోసం పలు క్రేజీ ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి.
Latest News