![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 04:09 PM
అనుపమ పరమేశ్వరన్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తెలుగు , మలయాళం మరియు తమిళ చిత్రాలలో పని చేస్తుంది.`ప్రేమమ్` సినిమాతో హీరోయిన్‌గా అనుపమ ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో ఆ మూవీ పెద్ద హిట్ అయ్యింది. దీంతో అదే రీమేక్ మూవీతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. అంతకంటే ముందే `అ ఆ`లో కీలక పాత్రలో నటించి మెప్పించింది.ఇక చివరగా ఆమె `టిల్లు స్వ్కేర్`లో లిల్లీగా మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తెలుగులో గ్యాప్ వచ్చింది. కానీ ఇటీవల తమిళంలో `డ్రాగన్`లో నటించి ఆకట్టుకుంది. పెద్ద హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనుపమా పరమేశ్వరన్‌కి సంబంధించిన ఓ వార్త ఇటు సౌత్‌లో దుమారం రేపుతుంది.అనుపమా పరమేశ్వరన్ ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్‌లో ఉందట. గతంలో తెలుగు హీరోతో రూమర్ వచ్చింది. కానీ ఎక్కువ రోజులు నిలవలేదు. ఇప్పుడు కోలీవుడ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందట.
స్టార్ హీరో కొడుకుతో ఆమె ప్రేమ వ్యవహారం నడిపిస్తుందట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు విక్రమ్. ఆయన కొడుకు ధృవ్ తో అనుపమా ప్రేమలో ఉందట. చాలా కాలంగా రహస్యంగా ఈ లవ్ ట్రాక్‌కి నడిపిస్తున్నారట. అంతేకాదు ఈ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందట. తాజాగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ధృవ్, అనుపమా కలిసి `బిసన్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బలపడిందని, అది పెళ్లి వరకు వెళ్తుందని తెలుస్తుంది.త్వరలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనుపమా `పరదా` అనే తెలుగు మూవీతోపాటు రెండు తమిళ చిత్రాలు, రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Latest News