![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 04:11 PM
నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా టీవీకే పార్టీ అధ్యక్షుడు, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చెన్నై పాలవాక్కంలో అంబేద్కర్ కు నివాళులర్పించారు. అయితే, ఆయన ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఒక చిన్న కారులో అక్కడి వచ్చి తనతో పాటు తెచ్చుకున్న పూలమాల అంబేద్కర్ విగ్రహానికి వేసి వెళ్లిపోయారు. ఒక స్టార్ హీరో, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఇంత సింపుల్‌గా వ్యవహరించడం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది విజయ్ సింప్లిసిటీకి మరో ఉదాహరణ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ సింప్లిసిటీకి వారు ఫిదా అవుతున్నారు.
Latest News