|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 05:59 PM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రాబోయే తెలుగు సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా మొదటి సింగిల్ 20 ఏప్రిల్ 2025న విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ చిత్రం యొక్క OTT హక్కులని టాప్ డిజిటల్ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ ఫాన్సీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్, కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.
Latest News