|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 08:49 PM
బాలీవుడ్ ఐటమ్ లేడీ ఊర్వశి రౌతేలా స్వస్థలం పౌరీ గర్వాల్ జిల్లాలోని కొట్‌ద్వార్ నగరం.‘నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి’ అంటూ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యలపై బద్రినాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు మండిపడుతున్నారు. నటి ఊర్వశీ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశీ మాట్లాడుతూ.. ‘‘ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి. దిల్లీ విశ్వవిద్యాలయంలోనూ నా ఫొటోకు పూలమాలలు వేసి నన్ను ‘దండమమాయి’ అని పిలుస్తారు. ఈ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజం. దీనిపై వార్తా కథనాలు కూడా ఉన్నాయి. మీరంతా వాటిని చదవచ్చు’ అని అన్నారు.ఊర్వశీ చేసిన వ్యాఖ్యలపై అక్కడి అర్చకులు మండిపడ్డారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, అయితే, ఆ ఆలయానికీ నటికి సంబంధం లేదని తెలిపారు. పురాణాలు, స్థానికుల నమ్మకం ప్రకారం శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం లేదా సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీ దేవి ఆలయంగా మారిందని చెబుతారు.
Latest News