|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 02:30 PM
నందమురి కళ్యాణ్ రామ్ యొక్క యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ సన్ అఫ్ వైజయంతి' ఏప్రిల్ 18న భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. ప్రదీప్ చిలుకురి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ శాంతి ఐపిఎస్ అధికారిగా కీలక పాత్రలో నటించారు. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా యొక్క సక్సెస్ మీట్ ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, పృథ్వి రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, సాయి మంజ్రేకర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, మ్యూజిక్ కంపోజర్ అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ తమ్మిరాజు మరియు స్క్రీన్ ప్లే రైటర్ శ్రీకాంత్ విస్సాతో సహా అద్భుతమైన సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం హామీ ఇచ్చింది. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News