|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 02:30 PM
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరోసారి ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్‌ఛాంప్స్ రేస్‌లో అజిత్ పాల్గొన్నారు. ఈ రేస్‌లో అజిత్ కారు అదుపుతప్పి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అజిత్ క్షేమంగా బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కాగా ఇటీవల కూడా అజిత్ రేస్‌లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.రేసింగ్ సమయంలో ఇంతకు ముందు కూడా హీరో అజిత్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈయన నడుపుతున్న వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇక, జనవరిలోనూ దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా.. ఆయన కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి సైతం ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పోర్చుగల్‌లో జరిగిన కార్ రేస్ పోటీల్లో అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది.
Latest News