|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 04:13 PM
అశోక్ తేజా దర్శకత్వంలో ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన శక్తివంతమైన మహిళా సెంట్రిక్ ఎంటర్టైనర్ 'ఒడెలా '2 ఏప్రిల్ 17న విడుదల అయ్యింది. ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ గా రన్ అవుతుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ అయ్యిన సందర్భంగా వేములవాడ రాజన్న దేవాలయాన్ని సందర్శించారు మరియు పూజలు నిర్వహించారు. ఈ సందర్శన కి సంబందించిన చిత్రాలని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో హెబా పటేల్, వసిష్ట ఎన్. సింహా, మురళ శర్మ, శరత్ లోహితాష్వా, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ ట్యూన్ చేశారు.
Latest News