|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 04:16 PM
రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్యల వివాదం మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్, శేఖర్ బాషా.. నన్ను చంపేయాలనుకుంటున్నారు లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. లావణ్య పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు తీసుకుంటాను అని, నార్సింగ్ పట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా హల్చల్ చేస్తోంది. నిన్న కంప్లైంట్ ఇచ్చాను అయినా కానీ పోలీస్ వారు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు. నాపై ఫిజికల్ గా దాడి జరుగుతుంది. లావణ్య రోడ్డుపై బైఠాయించింది నిన్న మళ్ళీ మా ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు. రాజ్ తరుణ్ శేఖర్ బాషా నా మీద దాడి చేయిస్తున్నారు. పోలీసులు కూడా నాకు న్యాయం చేయడం లేదు. వాళ్ళు ఎవరో నన్ను చంపే బదులు నేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రాణాలు వదిలేస్తాను అంటూ లావణ్య మీడియాతో తెలిపింది. కోర్టులో కేసు ఉండగా ఇలా నాపై దాడి చేయడం కరెక్ట్ కాదు అంటుంది లావణ్య.. ఇక్కడే పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను ధర్నాకు దిగడం కాదు ప్రాణాలే అర్పిస్తాను అని లావణ్య మీడియాతో తెలిపింది. ఈ గొడవ ఎటు దారితీస్తుందో చూడాలి.రు.
Latest News