|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 02:17 PM
మంజు వారియర్.. మంజు వారియర్ 1979 సెప్టెంబర్ 10న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ నగరంలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించారు . సినీ నటి, నృత్య కళాకారిణి, గాయని, నిర్మాత, రచయిత్రి కూడా.. ఈ బ్యూటీ ప్రధానంగా మలయాళ రంగంలో ప్రసిద్ధి చెందింది. 1998లో నటుడు దిలీప్‌ను వివాహం చేసుకుని, ల నుండి విరామం తీసుకుంది. ఈ దంపతులకు మీనాక్షి అనే కుమార్తె ఉంది. 2015లో విడాకుల తర్వాత 2014లో "హౌ ఓల్డ్ ఆర్ యూ.?" చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది."అసురన్", "లూసిఫర్" (తమిళం), "తుణివు" (అజిత్‌తో), "వేట్టయాన్" (రజనీకాంత్‌తో) వంటి చిత్రాలతో తమిళ ల్లో కూడా సత్తా చాటింది. "మనసిలాయో" పాటలో ఆమె నృత్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం "చతుర్ ముఖం", "విడుదల పార్ట్ 2" వంటి చిత్రాల్లో నటిస్తోంది.మంజు కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందింది. అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె "సల్లాపం" పేరుతో ఒక పుస్తకం రచించింది, అలాగే గాయనిగా కూడా తన ప్రతిభ చాటింది.మంజు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బైకర్‌గా కూడా గుర్తింపు పొందింది. 2024లో రూ. 21 లక్షల విలువైన బైక్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవలే విజయ్ సేతుపతితో కలిసి విడుదల 2లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ
Latest News