|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:24 PM
భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన ఎస్.ఎస్. రాజమౌళి తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'మహాభారతం' గురించి కీలక ప్రకటన చేశారు. ఈ భారీ చిత్రంలో నేచురల్ స్టార్ నాని భాగం కానున్నారని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన 'హిట్: ది థర్డ్ కేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు.మహాభారత ఇతిహాసాన్ని పది భాగాలుగా తెరకెక్కించాలనేది తన కల అని రాజమౌళి గతంలో పలు సందర్భాల్లో తెలిపారు. 'హిట్ 3' వేడుకలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి మాట్లాడుతూ.. "మహాభారతంలో నానికి పాత్ర ఇంకా ఖరారు కాలేదు కానీ, అతను కచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌లో ఉంటాడు" అని తెలిపారు. దీంతో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నాని ఉండటం ఖాయమని తేలిపోయింది.గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఈగ'లో నాని నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాతో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి 'మహాభారతం' ప్రాజెక్ట్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది.'హిట్ 3' వేడుకలో నాని మాట్లాడుతూ రాజమౌళి సినిమాలపై తనకున్న నమ్మకాన్ని సరదాగా వ్యక్తం చేశారు. రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నానికి స్థానం కల్పించడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వార్త నాని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Latest News