|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 03:26 PM
బాలీవుడ్ నటి నవీనా బోలే ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఒక ప్రాజెక్ట్ చర్చల సందర్భంగా సాజిద్ ఖాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.41 ఏళ్ల నవీనా బోలే కథనం ప్రకారం, దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఒక ప్రాజెక్ట్ విషయంలో సాజిద్ ఖాన్ బృందం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయన్ను కలవడానికి వెళ్లినట్లు ఆమె తెలిపారు. అయితే, ఆ సమావేశంలో సాజిద్ ఖాన్ తనను బట్టలు విప్పి కూర్చోమని అడిగారని నవీనా ఆరోపించారు. "ఆయన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏం చేయాలో తోచలేదు. భయంతో, నా స్నేహితులు బయట వేచి ఉన్నారని చెప్పి అక్కడి నుంచి వెంటనే ఇంటికి వచ్చేశాను" అని నవీన ఆ ఇంటర్వ్యూలో వివరించారు.ఆ సంఘటన తర్వాత తనకు సాజిద్ ఖాన్ బృందం నుంచి పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ తాను స్పందించలేదని నవీన పేర్కొన్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో మళ్లీ జీవితంలో సాజిద్ ఖాన్‌ను కలవకూడదని నిశ్చయించుకున్నట్లు ఆమె తెలిపారు. మహిళా నటుల పట్ల సాజిద్ ఖాన్ ప్రవర్తన సరిగా ఉండదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
Latest News