|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 03:29 PM
‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నటుడు రోహిత్ బాస్ఫోర్ జలపాతంలో పడి మృతి చెందాడు. ఆదివారం గువాహటిలోని గర్భంగా వాటర్ ఫాల్స్ సమీపంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. తన సహచరులు 9 మందితో కలిసి రోహిత్ వాటర్ ఫాల్స్ వద్దకు పిక్‌నిక్‌కు వెళ్లాడని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అతడు అందులో పడి మరణించాడని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని, 4.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నామని రాణి పోలీస్ అవుట్ పోస్టు పోలీసులు తెలిపారు. దాదాపు 6.30 గంటలకు రోహిత్ మృతదేహాన్ని ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీశారని చెప్పారు. ఆయన మృతి వెనుక ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. అయితే, రోహిత్ కుటుంబ మాత్రం అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అతడిని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లారని, మధ్యాహ్నం 12 గంటల వరకు అతడి ఫోన్ ఆఫ్‌లో ఉందని తెలిపారు. రోహిత్‌కు ఈత కూడా రాదని వివరించారు.
Latest News