|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 02:52 PM
ప్రముఖ దర్శకుడు త్రివిక్రామ్ శ్రీనివాస్ 'గుంటూరు కారం' తర్వాత తదుపరి చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ప్రకటించారు. ఈ సినిమా పౌరాణిక ఎంటర్టైనర్ అని వార్తలు వినిపించాయి. కాని అట్లీ చిత్రానికి నటుడు ప్రాధాన్యత ఇచ్చినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ఇ ప్పుడు ఆలస్యం అవుతోంది. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ తో చిత్రానికి వెళ్ళే ముందు త్రివిక్రామ్ త్వరగా ఒక సినిమాను పూర్తి చేస్తాడని పుకార్లు వచ్చాయి. చాలా పేర్లు వినిపించాయి కాని ఫిల్మ్ సర్కిల్‌లలోని తాజా రిపోర్ట్స్ ప్రకారం దర్శకుడు ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. త్రివిక్రామ్ ఇంతకుముందు వెంకీతో ఒక సినిమా ప్రకటించాడు కాని తెలియని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. వెంకటేష్ మరియు త్రివిక్రామ్ కుటుంబ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. సూర్యదేవర రాధకృష్ణ హారికా మరియు హాసిన్ క్రియేషన్స్ పతాకంపై ఈ బిగ్గీని నిర్మించనున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అప్పుడు సెట్స్ పైకి వెళ్ళ్తుందో చూడాలి.
Latest News