|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 02:50 PM
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన 'బడే మియా.. చేటే మియా' మూవీతో భారీగా నష్టపోయినట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీ వెల్లడించారు. సినిమా నిర్మాణం కోసం తమ ఆస్తులు కూడా అమ్మాల్సి వచ్చిందని వాపోయారు. ‘ఈ మూవీ కంటెంట్ ప్రేక్షకులతో కనెక్ట్ కాలేకపోయింది. అయితే వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు’ అని జాకీ భగ్నానీ చెప్పారు. ప్రేక్షకుల నిర్ణయం ఎప్పటికీ సరైనదేనని పేర్కొన్నారు.సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా ‘బడే మియా ఛోటే మియా’ సిద్ధమైంది. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా కీలక పాత్రల్లో నటించారు. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.102 కోట్లు మాత్రమే వసూలుచేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా. నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్తగా జాకీ భగ్నానీ తెలుగువారికి సుపరిచితమే.
Latest News