|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 07:29 PM
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో "పుష్ప 2: ది రైజ్" చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ ట్వీట్టర్(X)లో స్పందించారు. "ఈ అవార్డు అందుకోవడం ఎంతో గౌరవంగా ఉంది. ఈ గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ క్రెడిట్ మొత్తం నా దర్శకుడు సుకుమార్, నిర్మాతలు, 'పుష్ప' చిత్ర బృందానిదే. ఈ అవార్డును నా అభిమానులకు అంకితమిస్తున్నాను. మీ ప్రేమ, మద్దతే నాకు శక్తినిస్తుంది" అని బన్నీ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. కల్కి, లక్కీ భాస్కర్, రజాకార్ చిత్రాలకు పురస్కారాల పంట పండింది. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ , పుష్ప2కి అవార్డు దక్కింది. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను అందివ్వనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం జరగనుంది. విభజనకు కొన్నేళ్ల ముందు నుంచి సినిమా పురస్కారాలు పెండింగ్‌లోనే ఉండటంతో కొద్ది నెలల కిందట అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగిందని జ్యూరీ చైర్మన్ జయసుధ, జ్యూరీ సభ్యులు టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు.
Latest News