|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 04:15 PM
ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య, నేచురల్ స్టార్ నానికి శనివారం బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ‘సరిపోదా శనివారం’ చిత్రంలో ప్రతినాయకుడిగా అద్భుత నటన కనబరిచినందుకు గాను ఎస్.జె. సూర్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు’ (ఉత్తమ సహాయ నటుడు)కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నాని ఆయన్ని అభినందిస్తూ ట్వీట్ చేయగా, దానికి తాను తొందరలో సరిగా స్పందించలేకపోయానని సూర్య ఆవేదన వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే.. ఎస్.జె. సూర్యకు అవార్డు ప్రకటించిన వార్తపై నాని స్పందిస్తూ, "కంగ్రాట్స్ సర్. మీరు ‘సరిపోదా శనివారం’ చిత్రానికి కేవలం విలన్ లేదా సహాయ నటుడు మాత్రమే కాదు. మీరే అన్నీ. ఈ అవార్డుకు మీరు అన్ని విధాలా అర్హులు" అని ప్రశంసించారు. అయితే, షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎస్.జె. సూర్య ఆ సమయంలో కేవలం "చాలా ధన్యవాదాలు నేచురల్ స్టార్ నాని గారు" అని మాత్రమే బదులిచ్చారు.ఆ తర్వాత, తన స్పందన అసంపూర్ణంగా ఉందని భావించిన ఎస్.జె. సూర్య, శనివారం ఎక్స్ (X) వేదికగా ఓ సుదీర్ఘమైన, హృదయపూర్వకమైన నోట్ రాశారు. అందులో "ప్రియమైన నేచురల్ స్టార్ నాని గారికి.. క్షమించండి. షూటింగ్ మధ్యలో ట్వీట్ చేయడం వల్ల అది సరైన స్పందన కాలేకపోయింది. కేవలం 'థాంక్యూ సర్' అని చెప్పడం సరిపోదని నాకు తెలుసు. మీరు, దర్శకుడు వివేక్ గారు అందించిన మద్దతు లేకపోతే, షూటింగ్ నుంచి ఈ ట్వీట్ వరకు ఏదీ సాధ్యమయ్యేది కాదు. మీరు తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోనే. మీ దయగల మాటలకు చాలా చాలా ధన్యవాదాలు సర్" అని పేర్కొన్నారు.
Latest News