|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:37 PM
హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ ప్రత్యేక ఆకర్షణగా పాల్గొననున్నారు. ఈసారి మిస్ వరల్డ్ ఎవరవుతారనే ఉత్కంఠతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. మన ఇండియా నుంచి నందిని గుప్తా పాల్గొన్నారు.బాలీవుడ్ తారల ప్రదర్శనలు, విశిష్ట అతిథుల సమక్షంలో ఈ సాయంత్రం ప్రపంచ సుందరి కిరీటం ఎవరిని వరిస్తుందో తేలనుంది. 108 దేశాల నుండి వచ్చిన అందాల భామలు ఈ కిరీటం కోసం పోటీపడుతున్నారు. వీరిలో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు. ఫైనల్‌కు వేదికైన హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతూ.. ఈ మెగా ఈవెంట్‌కు వేదిక సిద్ధంగా ఉంది. ఫైనల్స్‌లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
Latest News