|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 12:02 PM
మిస్ వరల్డ్ అనేది చాలా గొప్ప అదృష్టం, బాధ్యత. ఎప్పుడైనా మనం చేసే పనులు గొప్పవై ఉండాలి. ఎందుకంటే మనం ఎలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్నవాళ్లు, మన పిల్లలు, కుటుంబ సభ్యులు ఎవరైనా మనల్ని ఎలా చూస్తున్నారో అనేది చాలా ముఖ్యమని ఓపల్ సుచాత చెప్పి అక్కడ ఉన్న వారందరి మనసును గెలుచుకుంది. ఈ ఒకే ఒక్క సమాధానంతో ఓపెల్ సుచాత మిస్ వరల్డ్ గా ఎంపికైంది.కాగా మిస్ వరల్డ్ విన్నర్ కు 8.5 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చారు. అలాగే 1770 వజ్రాలు పొందిన కిరీటం అందించారు. ఇవే కాకుండా లండన్ లో ఏడాది పొడవు నివాసం, డిజైనర్ కాస్ట్యూమ్స్ వార్డ్ రోబ్, నగలు అలాగే చెప్పులు అటు మేకప్ కిట్స్ కూడా అందిస్తారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులతో ప్రపంచమంతా పర్యటించవచ్చు. ఏం డబ్ల్యూ ఓ దాతృత్వ కార్యక్రమాలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తారు.ప్రస్తుతం వినియోగిస్తున్న మిస్ వరల్డ్ కిరీటాన్ని 2017లో రూపొందించారు. మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో ఈ కిరీటం నాలుగోది. ప్రస్తుత కిరీటం చుట్టూ ఏడు ఖండాలను ప్రతిబింబించేలా బంగారు రెమ్మలు ఉన్నాయి. వాటిని ముత్యాలు, వజ్రాలతో అలంకరించారు. 1951-73 వరకు కిరీటం ముత్యాలు, వజ్రాలతో ఉండేది.1974-2000 వరకున్న రెండోది కాస్త ముదురు ఎరుపు రంగులో ఒక శిలువలా ఉండేది.
Latest News