|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:29 PM
ఇటీవల గౌరీ స్ప్రాట్‌తో సహజీవనం చేస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఆమెతో బంధంపై ఆమిర్ మాట్లాడారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అసలు తాను ప్రేమలో పడాలనే ఆలోచనకు చాలా ఏళ్లు దూరంగా ఉన్నట్లు తెలిపారు. "నేను, గౌరీ స్ప్రాట్ అనుకోకుండా కలిశాం. ఆ తర్వాత స్నేహితులమయ్యాం. కొన్నేళ్ల తర్వాత మా మధ్య ప్రేమ పుట్టింది. ఇప్పుడు మా మధ్య నిజమైన ప్రేమ ఉంది. మేం భార్యాభర్తలు కాకపోవచ్చు... కానీ, ఎప్పటికీ కుటుంబంగానే ఉంటాం. నేను గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నాను. దాని తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. నా ఆరోగ్యంపై దృష్టిపెట్టాను. నా స్నేహితులు కూడా ప్రతి విషయంలో మద్దతుగా నిలిచారు. నాకు పిల్లలు, పేరెంట్స్ ఉన్నారు. వారితో రోజంతా గడుపుతాను" అని ఆమిర్ అన్నారు.
Latest News